పేరెంట్-టీచర్స్ సమావేశం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొందిరెడ్డి పల్లి, రాప్తాడు (మం) అనంతపురము జిల్లా
సమావేశ వివరాలు: తేదీ: 26/06/2023 సమయం ఉదయం 10.00 గంటలకు.
సమావేశ ప్రదేశం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,గొందిరెడ్డి పల్లి
ఉద్దేశ్యం:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొందిరెడ్డి పల్లి నందు తేది 26/06/2023న పేరెంట్-టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విద్యాభివృద్ధి కై గత నాలుగు సంవత్సరాలుగా చేపట్టిన అమ్మఒడి,జగనన్న విద్యాకానుక, మనబడి నాడు-నేడు తదితర కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేయడమైనది.
హాజరైనవారు:
పాఠశాల కమిటీ సభ్యులు
ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు
విద్యార్థుల తల్లి తండ్రులు, కాంప్లెక్స్ సి ఆర్ పి
ఎజెండా:
తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశంలో ఈ క్రింది అంశాలు చర్చించబడ్డాయి:
1) నాడు నేడు,
2) అమ్మఒడి,
3) జగనన్న విద్యాకానుక,
4) జగనన్న గోరుముద్ద,
5) జగనన్న ఆణిముత్యాలు,
6) ఇంగ్లీష్ మీడియంలో బోధన,
7) ఉయ్ లవ్ రీడింగ్,
8) లెర్న్ ఎ వర్డ్ ఎ డే,
9) క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్,
10) సబ్జెక్టు టీచర్ల ఏర్పాటు,
11) టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు
12) ఆయాల నియామకం,
13) స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు - పాఠశాలల మైనర్ రిపైర్స్ కొరకు నిధుల కేటాయింపు
14) ఉపాద్యాయులకు శిక్షణా కార్య క్రమాలు,
15) బాలికల కొరకు జూనియర్ కాలేజీల ఏర్పాటు,
16) ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్, స్మార్ట్ టి వి ల ఏర్పాటు,
17) రాగి జావ అందించుటకు, మధ్యాహ్న భోజనం చేయుటకు ప్లేట్స్, గ్లాసులు ఇవ్వడం,
18) ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం,
19) విద్యార్థుల ఆరోగ్య పరిరక్షనకు వైద్య పరీక్షల నిర్వహణ,
20) ఐరన్ టాబ్లెట్స్, అల్బెన్దజోల్ టాబ్లెట్స్ పంపిణీ
21) విద్యార్హులకు టోఫెల్ పరీక్షల నిర్వహణ,
22) బ్యాక్ టు ప్రోగ్రాం,
పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్రనాథ్,స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభం అయిన పిదప, రవితేజ రెడ్డి,పాఠశాల సహాయకులు(వ్యాయామ విద్య) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని , తల్లితండ్రులకు చదివి వినిపించారు. సమావేశం లో పాల్గొన్న, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ పథకాలను గూర్చి, తల్లితండ్రులకు అవగాహన కలిగించారు.
తల్లిదండ్రుల లేవనెత్తిన సమస్యలు:
పదవ తరగతి ఫలితాలు తక్కువ గా రావడానికి కారణం ఏమిటి?
ఉపాధ్యాయుల అభిప్రాయం:
గణితం సబ్జెక్ట్ లోనే విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అయ్యారని, మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ లో మంచి ఫలితాలు సాధించారని, ఈ సంవత్సరం మరింత శ్రద్ద తీసుకొని విద్యార్థులు గణితం లో పాస్ అయ్యేలా చేస్తామని తెలియజేశారు.
కార్యాచరణ ప్రణాళిక:
పదవ తరగతి కి గణితం బోధించే ఉపాధ్యాయుడి మార్పు - భాద్యతలను మరొక గణిత ఉపాధ్యాయుడికి అప్పగింత
జూలై 01/07/2023 నుండి పదవతరగతి విద్యార్థులకు ( గణితం)ప్రత్యేక తరగతులు
సమావేశ తీర్మానాలు :
1.జగనన్న విద్యా కానుక లో భాగంగా ఇవ్వబడిన
యూనిఫాం ను 28/06/2023 లోగా కుట్టించి,
షూస్,బెల్ట్ తో పాఠశాల కు పంపాలని
తీర్మానించడమైనది.
2. అడ్మిషన్స్ పెంపు కొరకు
ఉపాద్యాయులు,పాఠశాల కమిటీ సభ్యులు
కృషి చేయాలని తీర్మానించడమైనది.
3.రెండు నెలలకు ఒకసారి జరిగే సమావేశాలకు తల్లి లేక తండ్రి తప్పక హాజరై, తమ పిల్లల ప్రగతి పత్రాలను పరిశీలించాలని తీర్మానించడమైనది.
ముగింపు:
తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశం విద్యారంగంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాల పై తల్లితండ్రులకు మంచి అవగాహన కలిగించింది.
విద్యార్థి యొక్క పురోగతి మరియు అభివృద్ధికి సంబంధించి ఫలవంతమైన చర్చలను అందించింది. హాజరైన వారందరి క్రియాశీల భాగస్వామ్యాన్ని మరియు విద్యార్థుల పట్ల వారి నిబద్ధతను అభినందిస్తూ,ధన్యవాదాలు తెలియజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించితిమి.
సమావేశానికి హాజరు అయిన తల్లితండ్రులు:
1.A శివయ్య
2.B ఉజ్జినప్ప
3.U రాముడు
4. P చండ్రాయుడు
5. S మహాబీ
6. K ముత్యాలమ్మ
7. J నరసింహులు
8. N వెంకటేష్
9. P గోపాల
10 P బాలు
11 H మాధవి
12 H దేవి
13 A శ్రీనివాసులు
14 G చండ్రాయుడు మరియు మొదలైనవారు
సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు
నరేంద్రనాథ్ (ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు)
శివశంకర రెడ్డి ,పాఠశాల సహాయకులు(బయాలజీ )
సిరాజుద్దీన్, పాఠశాల సహాయకులు (ఆంగ్లం)
నారాయణ,పాఠశాల సహాయకులు (ఆంగ్లం)
సంధ్య పాఠశాల సహాయకులు (తెలుగు)
రవితేజ రెడ్డి, పాఠశాల సహాయకులు (వ్యాయామవిద్య)
కృష్ణ,పాఠశాల సహాయకులు (గణితం)
శ్రీధర్, పాఠశాల సహాయకులు (సోషల్) మొదలైనవారు
యం.నరేంద్రనాథ్,ప్రధానోపాధ్యాయులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,గొందిరెడ్డిపల్లి,
రాప్తాడు (మం), అనంతపురం (జిల్లా)